Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరో ద‌ర్శ‌న్ గురించి మాజీ ఎంపీ సుమ‌ల‌త కీల‌క వ్యాఖ్య‌లు!

Actor Darshan Always be my Son says Former MP Sumalatha
Advertisement
  • ద‌ర్శ‌న్ ఎప్ప‌టికీ త‌న కుమారుడి లాంటివాడేన‌న్న సుమ‌ల‌త‌
  • అత‌నితో గ‌తంలో త‌న‌ సంబంధం ఎలా ఉందో ఇప్ప‌టికీ అలాగే ఉంద‌ని వ్యాఖ్య‌
  • ద‌ర్శ‌న్ భార్య‌ విజ‌య‌లక్ష్మితో తాను నిత్యం మాట్లాడుతూనే ఉన్నాన‌ని వెల్ల‌డి
Advertisement
అభిమాని రేణుక‌స్వామి హ‌త్య కేసులో మ‌ధ్యంత‌ర బెయిలుపై విడుద‌లైన హీరో ద‌ర్శ‌న్ గురించి మాజీ ఎంపీ, సీనియ‌ర్‌ న‌టి సుమ‌ల‌త కీలక వ్యాఖ్య‌లు చేశారు. ద‌ర్శ‌న్ ఎప్ప‌టికీ త‌న కుమారుడి లాంటివాడేన‌ని అన్నారు. అత‌నితో గ‌తంలో త‌న‌ సంబంధం ఎలా ఉందో ఇప్ప‌టికీ అలాగే ఉంద‌న్నారు. 

ద‌ర్శ‌న్ భార్య విజ‌య‌లక్ష్మితో తాను నిత్యం మాట్లాడుతూనే ఉన్నాన‌ని తెలిపారు. ద‌ర్శ‌న్ శ‌స్త్ర‌చికిత్స‌కు నిరాక‌రించ‌డంతో వెన్ను నొప్పి నుంచి బ‌య‌ట ప‌డేందుకు మ‌రింత ఎక్కువ స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌న్నారు.  

ఇదిలాఉంటే... న‌టుడు ద‌ర్శ‌న్‌కు క‌ర్ణాట‌క హైకోర్టు సింగిల్ జ‌డ్జి బెంచ్ ఇటీవ‌ల మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే. అనారోగ్యం కార‌ణంగా వైద్యచికిత్సల‌ కోసం ఆరు వారాల గ‌డువుతో బెయిల్ మంజూరు చేసింది. కాగా, అభిమాని రేణుక‌స్వామి హ‌త్య కేసులో జూన్ 11న ద‌ర్శ‌న్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  
Advertisement
Advertisement
Sumalatha
Darshan
Karnataka

More Telugu News